పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

376

సౌగంధిక ప్రసవాపహరణము

భూరిగోపురచయంబుల విలాసములు
సారె వీక్షింపుచు సకలసౌభాగ్య
మందిరంబుల మేలు మచ్చులు గనుచుఁ
జందన క్రముకరసాలజంబీర
మాలూర శారద మాధవీ పనస
తాలతమాలలతాకుంజమంజు
పల్లవకోరక ప్రసనఫలాది
సల్లలితామోదసంయుతం బగుచుఁ
గలకంఠ శుకశారికాహంసచక్ర
విలసిత మధురవాగ్విభవంబుఁ గనుచు
వలనొప్ప శృంగారవనమధ్యమునను
వెలఁదులు పదియారువేలు గొల్వఁగను
జెలఁగుచు దివిజరాజీవలోచనలు
సలలితనాట్యప్రసంగము ల్నెరప
క్ష్మాపాలకన్యక ల్చామర ల్వీవ
గోపికాజనములు గొడుగులు బూనఁ
జనువుల రుక్మిణీసతి మొదలైన
యెనమండ్రసతులతో నింపు సొం పెసఁగ