పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/413

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

372

సౌగంధిక ప్రసవాపహరణము



చులకసేయుదురె నాశూరత్వ మి వుడు
కలయక్షకిన్నరగంధర్వపతుల
నలకాధిపతితోడ నని గెల్తుఁ జూడు
కినుకమాను మటంచుఁ గీర్తించి యతని
తనధ్వజంబున నుంచి ధర్మజాదులను
వారించి యరదంబు వైళంబ యెక్కి
దారుణశంఖనాదంబు బర్వించి
యక్షవల్లభునిపై నరదంబు నూకి
యక్షయదివ్యశరావళుల్ నించె
ఆలోన తెలివొంది యనిలాత్మజుండు 600
కాలునిగతి నార్చి గర్వంబు చేర్చి
యలకాధిపతిమీఁదఁ నరుదెంచుటయును
తిలకించి కాంచి యాదేవధ్వజుండు
పటుతరాంచితదివ్యబాణజాలముల
చటులత ముంచె రాక్షసకులేశ్వరుని 605
మకుటంబు దునిమిన మండి సురారి
వికలంబు నొందక వికవిక నగుచు
దేవధ్వజుని ముంచె దివ్య బాణముల