పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



తృతీయాశ్వాసము


మణిమంతుతోఁ గొంత మసలక పోరి
సురనదీతనయుండు సూర్యబాణమున
సరగున నతని మూర్ఛ ముడుంగనేసి
మరలి పౌలస్త్యకుమారుని, డాఁకి 515
శరవృష్టి గురియించి చలియింపఁజేసె
అక్కడి కలకలం బాలించి చూచి

కుబేరార్జునులయుద్ధము - అర్జునునిమూర్ఛ

జక్కుల యెకిమీఁడు సాహస ప్రతిభ
నరదంబు మరలింప నమరేంద్రసుతుఁడు
పరికించి యక్షాధిపతికి నిట్లనియె520
ఇక్కడ నే నుండు టెఱిఁగియు సూరు
అక్కడఁ జనఁ జెల్లు నా కిన్నరేంద్ర!
చలమున ననుడాసి సమరంబు చేసి
గెలిచి పోదువుగాని కేడించి నిలువు
మిన్నక నామాట మీరిపోయినను525
వెన్ను గాయంబుల వేధింతు నిన్ను[1]

'
  1. వెన్నుగాయంబుల వెలయింతు నిన్ను (త)