పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

366

సౌగంధిక ప్రసవాపహరణము



నిల మణిగ్రీవుఁ డనేక బాణముల
ముంచినఁ గని ద్రోణముఖ్యులౌ యోధు
లంచితశరనృష్టి నపుడు గప్పుటయు
నవి యెల్లఁ దునిమిన నాచార్యసుతుఁడు
వివిథాస్త్రములు యక్షవిభునిపైఁ బరపెఁ
బెట్టుగ నర్చుచు భీమసేనుండు
ధట్టించి గద కరద్వయమునఁ బూని
నడతెంచుటయుఁ జూచి నలకూబరుండు
బెడిదంపుటమ్ముల భీముని ముంచె
నవి సడ్డనేయక ననిలనందనుఁడు
కవిసె పక్షులమీఁదఁ గన్నె సాళ్వంబు
గోరించుగతి యక్షకోటుల మోది
ఘోరదానవుల మార్కొని చక్కు చేసి
గరుడుల మణియించి గంధర్వవిభుల
ధరఁ గొల్చి కిన్నరదళములఁ జంపి
నలకూబరుని తేరు నలినలిఁజేసి
యల మణిగ్రీవునియరదంబు దునిమె
రణభయంకరపరాక్రమశాలియైన