పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

365


గలగించి సారథి ఖండించి వైచి
భానుకేతనునిఁ దొంబది నారసములఁ |
బూని ఘోరాహవంబునఁ జక్కు చేసి
సకలబలంబుల సైన్యాధిపతుల
ప్రకటించి చీకాకుఁబడఁ జెండివైచి480
కుండలీకృతముగాఁ కోదండమమరఁ
గాండముల్ పూసుట కడిమి నేయుటయు
దెలియఁగూడకయుండఁ దేజంబు మెరసి
బలియుర యోధుల భంజించి గదిమి
వెలయమణిగ్రీవు వికలంబుఁజేసి485
నలకూబరుని ముంచె నవభల్లములను
నలకూబరుఁడు గురునందనుమీఁద
నలువది దివ్యబాణంబు లేయుటయుఁ
బొడియయ్యె నరదంబు బొలిసే గుఱ్ఱములు
మడిసె సారథి బిల్కుమారె కేతనము490
తెరలక వేరొక్కతేరిపై నెక్కి
గురునందనుఁడు నలకూబరుఁ గదిసె
నలకూబరుఁడు గప్పె నానాశుగముల