పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

363



నురము వ్రీలంగ మహోగ్ర బాణముల
నెరి దూరవేసిన నిట్టూర్పు విడుచు
సొరిది నల్టిక్కులుఁ జూచి భీతిల్లి
పరువడి వెన్నిచ్చి పరతెంచుటయును 450

 

కర్ణుని పలాయనము


గని మణిగ్రీవుండు గదియ నేతెంచి
యినసుత నిలు! నిలు! మేల పోయెదవు
మలయుచు మీవారు మావారు జూడఁ
దలచెడి పారుట ధర్మమే నీకు !
బిరుదు వాక్యము లాడి పెక్కులు వ్రేలి 455

పరులందఱుమ జూచి పకపకనవ్వ
పోయిన నిన్నేల పోనిత్తు నేను
మాయన్న ! తొలఁగని మగవాఁడ వీవు !
చలియించి నీ విట్లు జరుగుట కేను
తలపోయ నినుఁ జూచి తక్కినయట్టి 460
నెరయోధు లీబుద్ధి నేర్చెద రింక
నెరి సాహసం బెల్ల నీట గల్పితివి