పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/402

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

361



నన విని యినసూనుఁ డామణిగ్రీవుఁ
గనుఁగొని యిట్లనుఁ గలకల నగుచు
మీరాజు మారాజు మీయోధకారులు
మారధికోత్తముల్ మాసాహసములు
ప్రతిభలు మనుమున్నె పరికింప లేదె! 415
ఇతఁడు చూడకయున్న నేమిటఁ గొదుపు !
నిన్నుఁ జూచిన నిల్వు నీరు బండెడిని,
ఎన్నఁడుఁ బరికింప నిటువంటివాని !
సామజేంద్రముతోడ సయ్యాట లింత
దోమకు సాగునే! తొలగుము వేగ 420
నెరవుగా బల్కెదె నీయీడువారు
కలరు మాసేనలోఁ గదనంబు సేయ;
నస దీరకున్న యానలబరుసకుఁ
గొసరుగా నిచ్చెదఁ గోరి నిన్నిపుడె
యని వారి సంధించి యరదంబు గదిమి 425
కనకపుంఖోజ్వలసువ సాయకముల
నిరువుర నొప్పించె నిషుపరంపరల
నరదముల్ దివ్యశరాసనంబులును