పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

360

సౌగంధిక ప్రసవాపహరణము


అధికుఁడ వైన జయ్యన నేగి యొక్క
రథమెక్కి రమ్ము దురమ్ము సల్పుటకు
ప్రాణంబుపై నీకు భ్రమ కల్గెనేని
మాను మీమాటలు మరలిపొ మ్మనిన;
నరిగి రథం బెక్కి నలఘుకోదండ
ధరుఁడై కుబేరనందను వడి దాఁకె

కర్ణ మణిగ్రీవుల యుద్ధము


అపుడు మణిగ్రీవుఁ డతిమూర్ఛ బెలిసి
తపనీయదివ్యకోదండంబుఁ బూని
చపలాలతికబోలు శరము సంధించి
కుపితుఁడై కర్ణునిఁ గ్రోధించి చూచి
నలకూబరుని యాననము విలోకించి
వలదయ్య యిట కేల వచ్చితి నీవు '
మానవుం డనుచు నేమరియుంటిగాని
యీనృపాలకు ద్రుంప నెక్కడె నాకు -
వాహిని కెక్కు. నావరశక్తి యితని
బాహాబలము నీవె పరికించవలయు !