పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

359



జత్తురు నొత్తురు సరియౌదు రింత
నిత్తెరంగున నుండ నే నెందుఁ జూడ
నట మున్నె కమలంబు లర్పింతురేని
యిటువంటి యాపద లేటికి వచ్చు.380
గరుణతో నికనైనఁ గాఁచెద వేగ
సరసిజాతములఁ బాంచాలి కొసంగి
కౌరవేంద్రున కలకాపురం బిచ్చి
వీరధర్మము మాసి విపినభూములకుఁ
జనుఁ డని పలుక రోషంబు రెట్టించి 385
ధననాథసుతుఁడు రాధాపుత్రుఁ దాఁకి
యిరవంద గద బూని యినతనూభవుని
కరమందు వెలుగొందుఖడ్గంబు దునిమి
విరథుఁడవై యుండి వీరవాక్యములు
తరముగా దిది నీకు తరలుము కర్ణ!390
యరదంబుపై నెక్కి యస్త్రముల్ పూని
బిరుదువాక్యము లాడి బెదరింతు మమ్ము
చెడుగ! నిన్నీ వేళఁ జేఁగాచినాడఁ
జెడిపోవ వలదు నీ సేనది క్కరుగు