ఈ పుట ఆమోదించబడ్డది
ఉపోద్ఘాతము
ఈ ద్విపదకావ్యము క్రీ. శ. 1868 సంవత్సరమున చెన్నపట్టణములో నేలటూరి సుబ్రహ్మణ్యముగారి విద్యావిలాస ముద్రాక్షరశాలయందు పిళ్లారిసెట్టి రంగయ్యనాయనివారిచే ముద్రింపఁ బడి ప్రకటింపఁ బడియెను. ఆప్రతి నామిత్రులగు శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు నా కిచ్చి యందలి చరిత్రంశములఁగూర్చి వ్యాసమును వ్రాయఁగోరిరి. తర్వాత గ్రంథపీఠికభాగమును జదివి, ఆంధ్ర పరిషత్పుస్తక భాండాగారములోని తాళపత్రగ్రంథములను పరిశోధించి, లేఖకప్రసూదములను గొన్నిఁటి సంస్కరించి పరిషత్పత్రికసంచికలో (ఫిబ్రవరి-మార్చి-1937) నొక వ్యాసమును వ్రాసితిని.
రత్నాకరాన్వయుఁడైన ఈకవి భట్టుకులజుఁడు తండ్రిపేరు కృష్ణమరాజు, తనకులగోత్రములను గ్రంథమునందు చెప్పకపోయినను, ఈ రత్నాకరవంశజులు భట్టుకులమువా రని రత్నా