పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

358

సౌగంధిక ప్రసవాపహరణము



బొలుపొందఁ బూచిన మోదుగు లనఁగ
బలువైన కాలవిపర్యాసములను
తరకొని యుభయసంథ్యా రాగములను
సరిపడి సమరంబు సలిపి రాఘనులు
అక్కడ రాధేయుఁ డాహవస్థలము
గ్రక్కున శోధించి కదిపి వెన్నంటి

 

కర్ణుని బలపరాక్రమములు



కేక వేయుచు మణిగ్రీవునిరథము
పైకిని లంఘించి పౌలస్త్యుఁ గాంచి
యక్కటా! యిటువంటి యతిరథోత్తముని
చిక్కించి చూడంగఁ జెల్లునే మీకు!
చీడిముడి పులినోటఁ జిక్కిన వేగ
విడిపించుకొనునట్టి వీరులు లేరె!
తొట్టున వగగొర్ల దొడ్డి సొచ్చినను
బట్ట నియ్యరుబంటు పంతంబు మెరసి
యెన్నెన్ని పలికిన నేవ లే దింత
"నెన్నాళ్ల పగ యుండె నీతనిమీఁదఁ