పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

355



కోటులు కర్ణుఁ దార్కొని పోరి రపుడు
అందరిమీఁద యయ్యధికుఁ డంభోధి
మందరనగము డా మధియించు లీల
పరుపడి బహుదివ్య బాణజాలముల
నరదంబులను గూల్చి యధికుల దునిమి 310
తురగంబుల వధించి దొరల మర్దించి
కరకరి సూతుల గళముల చిదిమి
ప్రళయకాలమునాటి భానుని సరణి
కలయించి యలయించి గగ్గోలుపఱచి
పరువులు బారించి భయము పుట్టించి 315
గరిమతో విజయశంఖంబుఁ బూరించె
నటమున్న చయ్యన నరదంబు నెక్కి
పటురోషమున భీష్మపార్థివేంద్రుండు
నలుదిక్కులు గలంగ నారి మ్రోయించి
పాలుపొంది మణిమంతుపుత్త్రునిమీఁదఁ 320
జలమునఁ నొకయర్ధచంద్రబాణంబు
కలితమంత్ర యుతమ్ముగా నే యుటయును
యక్షాధినాయకుఁడావిధమంత