పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

354

సౌగంధిక ప్రసవాపహరణము



యమరనదీసూనుఁ డర్థచంద్రాంశు
గములచే నిరువురి కంఠముల్ ద్రుంచి
రమణ జయంధరు రథముపై కురికి 290
కరవాల మంకించఁ గని మణిగ్రీవుఁ
డురవడి నెడసొచ్చి యొక్క భల్లమున
వాలు చూర్ణము చేసి వరదివ్యబాణ
జాలంబులను మేను జల్లైడగండ్లు
చేసిన వీక్షించి చెలఁగి కర్ణుండు 295
భాసిలుఘనదివ్యబాణత్రయమున
గెరలి యేసిన మణిగ్రీవుండు మూర్ఛ
నొరగిన సారథి యొక్కింత డవ్వు
దొలఁగింప సూతపుత్రుండు పోనీక
బలువడి వెన్నంటి పరతెంచుటయును 300
కంచురథంబుల గంధర్వపతులు
కొంచింప కరువది కోట్లుమార్కొనియె
తమకించి యుక్కు రథంబుల యక్ష
రమణు వెంబడి కోట్లు రాధేయు గ్రమ్మె
పాటించి కిన్నర ప్రభులు ముమ్నారు 305