పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

353



విలుగుణధ్వని చేసి వెస నార్చుటయును;
గలఁగకఁ దొలఁగకఁ గాంగేయుఁ డపుడు
మరియొకరథ మెక్కి మార్గణవృష్టి
గురియించి మణిమంతుఁ గూర్మినందనుని
తనువెల్ల నించినఁ దర్పంబు 'మెరసి 275
కనలి జయంధరగంధర్వవిభుఁడు
కడువడి భీష్ముని కవచ మింతింతఁ
బొడిపొడిచేసినఁ బొంగి గాంగేయుఁ
డెనసిన కినుక నర్ధేందుబాణముసఁ
గనకకిరీటంబు ఖండించుటయును 280
చిత్రాంగదుండు విచిత్ర కేతనుఁడు
'థాత్రి వ్రీలఁగ నార్చి దర్పముల్" మెరసి
యవలీల గాంగేయు నరదంబుఁ గూల్చి
వివిధసాయకముల విలు ద్రుంచి వైచి
సారథి హరులను సముయించి ఘోర 285
నారాచముల మేను నాట నేయుటయుఁ
దమకించి యొండు రథంబుపై నెక్కి