పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

352

సౌగంధిక ప్రసవాపహరణము



కడు మణిగ్రీవుండు గరుడాంబకమున
పొడిపొడిగా, నేసే భోగిశరంబు
మణిమంతుఁ డొగి బ్రహ్మమార్గణంబునను 255
గణుతింపఁ గమలజకాండంబు నేసె
అనిలాంబకము బూని యల జయంధరుఁడు
కనలి మేఘశరంబు ఖండించివైచె
వరుణసాయకమున వహ్నిబాణంబు
పరియలు గావించె భానుకేతనుఁడు 260
ధనదుఁడు పొంగి మార్తాండబాణమునఁ
దనరారఁ గూల్చె రౌద్రశిలీముఖంబు
రహిమీర తక్కిన రసిక శేఖరులు
మహిగూలి రత్యంత మహితశస్త్రముల
అరిమురి గెరలి జయంధరుం డపుడు 265
సురనదీతనయుని జూచి క్రోధించి
ఘనదివ్యశరవృష్టి గప్పి నొప్పించి
జననుతతాళధ్వజంబు ఖండించి.
యతఁ డేయుశరముల నన్నింటి దునివి
యతులితం బైనట్టి యరదంబు గూల్చి 270