పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

351



నరవాహనునిమీఁద నాగ కేతనుఁడు235
కరమర్థి జలధరకాండంబుఁ జొనిపెఁ
గూర్చి కుబేరుపైఁ గురునందనుండు
నార్చుచుఁ గినిసి రౌద్రాశుగం బేసె
కర్ణుండు శ్రీదుపైఁ గవిసి దేవతలు
వర్ణింపఁ బావకోజ్వలబాణమేసె 240
మరియు దక్కిన యోధమండలావళులు
గురియించి రాశుగఘోరవర్షములు
సగగున నాదివ్యశరపరంపరలు
గరికరి నొరిసి లోకములు బెగ్గిల్లఁ
బ్రళయ భైరవమహాపటహనిర్ఘోష 245
కలితభూతేశ ఢక్కా, ఢమత్కార
శతకోటి శతకోటి సంకులాఘోష
తతహవ్యవహభీమ ధామంబు నగుచుఁ
దనరుచు భూనభోంతరములు నిండి
చనుదెంచు నాదివ్యశరములు గాంచి 250
నాగాశుగముచేత నలకూబరుండు
బాగుమీరిన వాయుబాణంబు దునిమె