పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

350

సౌగంధిక ప్రసవాపహరణము




బెదరె శేషుఁడు గిరుల్ పృధ్విలో గ్రుంగె
నది మహాప్రళయమార్తాండప్రకాశ
మండితం బగుచు శుంభత్ప్రౌఢి నిగుడె
గాండీవధన్విదాఁగని విజృంభించి
ధారుణీతలము దిక్తటము లల్లాడ
వారణాస్త్రము బూని వైచె వైచుటయు
నది మహావిలయకాలాంతకాభీల
విదితగదాదండ విలసితం బగుచుఁ
జనుదెంచి రవికోటిసన్నిభమైన
యనలఘోరాశుగం బవలీల దునిమె
ఆమరేంద్ర సుతుఁడు యక్షాధిశుమీఁద
సముదగ్రతరవాయుసాయకం బేసె,

ఉభయపక్షముల పోరాడుట



నలకాధిపతిమీఁద నలిని గాంగేయుఁ
డలఘుమహోగ్రనాగాశుగం బేసె
నిరవొందగాఁ గిన్నరేంద్రునిమీఁదఁ
బరువడి ద్రోణుడు బ్రహ్మాస్త్ర మేసె