పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

349



కనుగొంటి నీపరాక్రమకౌశలంబు
ఘనయోధవరులలో ఘనుడవు నీవు
నే నిను గెల్చిన నెగడు నాకీర్తి 205
నే నీకు నోడిన నే కొద్ది గాదు.
వనధిలంఘించి రావణు పురి గాల్చి
చనుదెంచు కపికులచంద్రునికంటె
నగముల గూల్చి దానవుల ఖండించి
జగముల నుతిగాంచు జంభారికంటె 210
అంగజు హరియించి యజుతల ద్రుంచు
గంగాధరునికంటె ఘనుఁడనే నేను!
కేవున వారల గెలుచు నీలావు
చూపుము నాబల్మి చూతువుగాని
అని పల్కి క్రోధించి యాగ్నేయశరము 215

కుబేరార్జునుల యుద్ధము



ఘనమంత్రయుతముగా గాండీవిమీఁదఁ
బనిపిన పటపటఁ బగిలె నంబరము
ధరణి వణంకె దిగ్దంతులు మ్రొగ్గె