పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

348

సౌగంధిక ప్రసవాపహరణము



నల్పసాంగత్యంబు నల్పయుద్ధంబు
నల్పమానవసేవ సల్పాయుధంబుఁ
గ్రొవ్వునఁ జేసినఁ గోదువలౌ నిజము
కవ్వడి విను కొంచెగాఁడవా నీవు
ధరణిపై దివ్యకోదండ పాండిత్య
శరకౌశలరణోగ్రసాహసం డనుచు
కాలకేయనివాతకవచాది దైత్య
జాలభిద్వలమహోత్సాహివీవనుచు
వాతాత్మజునితోడ వాదుకై యంప
నేతువు కట్టి గెల్చిన ధీరుఁ డనుచు
వరఖాండవవనంబు వహ్నికి నచ్చి
సురరాజుదరిమిన శూరుఁడవంచు
హెచ్చుగా శంకరు నెదిరి పోరాడి
మెచ్చులు గైకొన్న మేటి యటంచు
నారదుచే మున్ను నానావిధముల
నారూఢిగా విని యధిప నీతోడ
నని సేయఁ దలంచి నే నరిగితి నిటకు
వినుట నిశ్చయము గావింపగా నిపుడు