పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

345



చటుల జాజ్వల్య పాషాణముల్ గాఁగఁ
బటుభేరిరథనేమి బలఘోషణములు
ఖగమృగారావసంకరములుగాఁగఁ 135
దగి యెప్పు ధననాథు దళమహాటవులఁ
చలపడి తనబాణదావాగ్ని చేతఁ
జలమున ముంచి భస్మంబుఁ గావించె
వెస నార్చి ధనదని వెన్నంటనేసి
మసలక నేనూట మణిమంతు నొంచి140
యెలమి మణిగ్రీవు నిన్నూట జడిపి
నలకూబరుని మాట నాటంగ నేసి
వరబలో ద్దండదుర్వార ప్రచండ
నిరుపమపాండిత్యనిజభుజాదండ
సారుఁడై తగు సవ్యసాచి నీక్షించి145
ధీరతో ధనాధీశుఁ డిట్లనియె

కుబేరార్జునుల సంవాదము


నరుఁడ వటంచు నెంతయు నిన్ను నేను
పరువ సేయకయున్న పైకొనివచ్చె