పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

344

సౌగంధిక ప్రసవాపహరణము



గటికవాఁడును వోలి గాండీవధన్వి
కటికపోగులు వైచె ఘనభీకరముగ
నలిగి యంతటఁ బోక నాసవ్యసాచి
చెలఁగి యక్షబలంబుఁ జెదరించి నరికి
యొండొండ ఖండించి యోజలు గోసి
నిండారు నెరపిన నీటువాటిల్ల
తలకొని చిర్లాడి తప్పిపోనీక
నలినలిగాఁగ సైన్యముల ఛేదించి
ఘనరథంబులు మహాగ్రావము ల్గాఁగఁ
దనర కేతనములు తరువులు గాఁగ
ధనురాదులు లతావితానముల్‌గాఁగఁ
దనువులు భీకరస్థాణువుల్ గాఁగఁ
నేనుఁగుల్ గండశైలేంద్రముల్‌గాఁగఁ
నానాయుధంబులు నాగముల్‌గాఁగఁ
దురఁగముల్ హరిణసందోహమల్ గాఁగ
వరనూత్న బహుచిత్ర వర్ణవస్త్రములు
పొలుపొందఁబూచిన పొదరిండ్లు గాఁగ
సలలిత బహురత్న చయభూషణములు