పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

283

విరిగి పొడువుం డని వెన్నంటువారు
నలకూబరుం డేడి నరపతి యేడి 1585

పొలియింతు మని చొచ్చి పోయెడివారు
నలకూబరుఁడ నేనె నరపతి నేనె
మలసి నిల్వు డటంచు మార్కొనువారు
తేజీల తేజీల ధే యని నూకి
నేజెలచే గ్రుమ్మి నిగుడి వెన్నంటి [1] 1590

పాటించి రౌతును బల్లంబు హయము
వేటారుదునెలు గావించి భేదించి
కో యని యార్చి కగ్గోలుగా నరికి
హాయి! బాబు! శబాసు! రని వ్రేలు గరచి
అటె నీవేముస్తైదు లరి మురి ద్రుంచి 1595
తుటెములపైఁ జొరఁ దోలు రాహుతులు
గజముల గజముల గజిబిజి గొనఁగ
నిజభుజాబలశక్తి నిగుడి కవ్వించి

  1. a. నేజీలచే గ్రుమ్మి నిగుడివెన్నంటి (క)
    b. నేజలచే గ్రుమ్మి నిగుడివెన్నంటి (చ)