పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

282

సౌగంధిక ప్రసవాపహరణము

లగువుల దవ్వుగా లంఘించువారు;
చేరి పెద్దకటార్ల చే కొద్ది గ్రుమ్మి
కేరి చివ్వున గుప్పళించెడువారు[1]

ప్రేలుచు క్రొవ్వాడి పిడెముల నూని
లీలమీరఁగ చౌకళించెడువారు;
భోరున పొడిచినపోటు గండ్లబడి
దూరి యావలదాటి దూపెడువారు,
గుంపులు నొంటిగా గోరించువారు,

గుంపుగా నొక్కని గ్రుమ్మెడువారు
నివల కవ్వల నుంచి యేతెంచువారు,
నవల కివ్వల నుంచి యరుదెంచువారు,
నాథ పరాకయ్య ననుఁజూడు మనుచు
యోథావళుల మీఁద నురికెడువారు;

తలలు ఖండించి వింతగ నెగవైచి
సెలగో యనుచు నార్చి చేయెత్తువారు
అరుదొంద కల్లిల్లి కార్భటుల్చేసి

  1. కేరి చివ్వున గుప్పగించెడువారు (క)