పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

279

ఆవీర యోధుల నలఘు తేజంబు
భావింపఁ గన్నులపండు వయ్యెడిని;
మానవులే యని మసలఁగా వలదు
నీ నేర్పుఁ జూచెద నెరయోధవరుల 1520

బలముల సేనాధిపతుల నేర్పఱచి
కలనికి యరిమొనగా నిల్పు మనినఁ
జని సర్వ సేనల సమకట్టి నిలిపి
ఘనభేరికాహళఘంటికారావ
ముల బెట్టుగా మిన్నుముట్ట మ్రోయించి 1525

కలఁగి పద్నాల్గు లోకములు భేదిల్ల
తరుచుగా సింహనాదములు నేయించి
నిరుపమాటోవుఁడై నిఖిలసైన్యముల
పేరైన యోధుల పేరులు వాడి[1]
భోరున కలనికిఁ బురికొల్పుటయును 1530
భీష్మప్రతాపజృంభితశౌర్యధనుఁడు

  1. 1 a. పేరైనయోధుల పేరులు చాపి (క)
    b. పేరైనయోధుల పేరులఁ జీరి (చ)