పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

సౌగంధిక ప్రసవాపహరణము

మాట యొక్కటి గాక మఱియొండు గలదె 1400
పొలుపొందఁగా మించిపోయిన సిగ్గు
తలపోసు కొన్న నెంతయురాదు వినుము
పెక్కుమాటలు నేర్చి ప్రేలెడువాని
కెక్కడిసిగ్గు నీ కేల చింతింప
పొగరు నుద్దండంబుఁ బుట్టక యుండ 1405
సుగు లడంగించె రక్షోవల్లభుండు
నిలుపుము శాంతంబు నీతిధర్మంబుఁ
దలఁపుమీ యిఁకనైనఁ దలదాకె నంత
అనుచుఁ జిల్లులు వోవ నాడినమాట
లెనయంగ చిలుకులై హృదయంబు గాడి[1] 1410
వెనకముందఱఁ జూచి వికలంబు నొంది
వినియును విననట్లు వెస నేగుటయును

నలకూబరుఁడు యుద్ధమునకు సన్నద్ధుఁడగుట



అక్కడ సకల సైన్యసమేతుఁ డగుచు
జక్కులరాపట్టి చనుదెంచుటయును

  1. లెనయంగ ములుకులై హృదయంబుగాడి (క. చ)