పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

271

ధర వ్రీల శంఖనాదంబు పూరించె
తతశక్తి ధర్మనందను నాజ్ఞఁ బూని
యతివేగ నుభయ సైన్యంబులు గదలె
శరజా ప్తతనయదుశ్శాసను ల్మూర్ఛ
లరయంగ దెలిసి విహ్వలచిత్తు లగుచు 1390

మొలకసిగ్గులు మొగంబుల నావహింపఁ
దలలు వంచకయున్నఁ దగ నిరీక్షించి
గురుసూనుఁ డంత నర్కుని సుతుఁ గాంచి
విరుగుట దిరుగుట వీరుల కెల్లఁ
గలదు నీతరమునఁ గలుగునే కర్ల[1] 1395

అల ఘటోత్కచుని సాహసముఁ జూచితివి
నెలవుగా మాబుద్ధి నిజమాయె నింక ,
ములును దాకఁగఁగాని మొగ్గ రెవ్వారు[2]
హాటకంబుగ మించి నాడరా దనెడి

  1. విరుగడ తిరుగడ వీరులకెల్ల
    గలదు నీ తెరగున గల్గెనే కర్ణ (త)
  2. ములును దాకినఁగాని ముగ్గ రెవ్వారు (చ)