పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

257

గనుపడువేళల గౌరవకోట్ల
దునుమాడి ధర్మపుత్త్రునిచేత ధరణి 1140

నేలింతు నని మది నేఁగోరుచుండ
నేల వచ్చితి రిఁక నెందుఁ జొచ్చెదరు
రవిసుత నినుఁ జంపి రారాజు ద్రుంచి
కవిసి దుశ్శాసను ఖండించి శకుని
దునుమాడి తక్కిన దొరల మర్ధించి 1145

ఘనవైభవంబులఁ గరిపురి కరిగి
గట్టిగా పాండవాగ్రణికి నే నిపుడె
పట్టంబు గట్టుదుఁ బటుశక్తి మెరసి
అనితనయరదంబు నంటగాఁదోలి
ఘనశిలీముఖములు కర్ణునిమీఁదఁ 1150

గురిపించి పడగలు గొడుగులు సించి
వరధనుర్బాణముల్ వ్రయ్యలు చేసి
యరదంబు సారథి హరులఁ జెండాడి
కరవాలమును పల్క కవచంబు దునిమి[1]

  1. కరవాలమును వల్క కవ్వంబు దునిమి (ట)