పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

249

యడిదంపు పలక రయంబునఁ బూని
నడతెంచె యాచార్యనందనుం డపుడు; 1010
తడఁబడి కార్యంబు దప్పె నటంచుఁ
దొడిబడి నరదంబు దుమికి యేతెంచి
నరపతి యిరువురనడుమ దాఁ నిలిచి
గురునందనునకు మ్రొక్కుచు మస్తరించి[1]
గరిమతోఁ గర్ణుని గౌఁగిటఁ జేర్చి 1015

దుర్యోధనుఁడు వారిని వారించుట



సరసోక్తులకు వారి సమ్మతిపఱచి
పలుమరు గర్ణుని భావించి చూచి
పలికె నెయ్యంబుతో ఫణికేతనుండు
ఇదియేమి రాధేయ యేల పోరెదవు
పదుగురు గా దన్నపని సేయఁదగదు 1020
విహితం బెఱుంగపు వినుము నాబుద్ధి
బహుజనద్వేషంబు భావ్యంబు గాదు

  1. 1.గురునందనునకు , క్కుచు కుస్తరించి (క)
    గురుసుతునకు మ్రొక్కి కోపంబు మాన్చి (చ)