పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

సౌగంధిక ప్రసవాపహరణము


క్రుమ్మి రెమ్మియు జిమ్మి గ్రుచ్చి నాటించి
బిమ్మటి గొనతేనె పెరవూగినటుల[1]
గదిసిన యక్షరాక్షససేనఁ జూచి385
బెదరక నెదురేఁగి భీమసేనుండు
దురుసుగా నెడలేక తొలుకారువాన
గురియుచందంబున ఘోరబాణములు
సడలక నేయుట సంధించుటయును;
గడు నెఱుంగకయుండఁగా వప్పళించి[2] 390
పక్కలు బిక్కలు పాదము ల్దొడలు
చెక్కలు ముక్కలు చేతులు చెవులు
నడుములు మెడలును నరములు శిరము
లుడుగని గనుక నొక్కుమ్మడి చిదిమి
భటుల నెల్లను బటాపంచ గావించి 395
చటుల భయంకరజ్యారవం బెసఁగఁ
గమకించి తురగసంఘములు నూటాడి

  1. బెమ్మెర గొని తేనె పెరమూగినటుల (ఛ)
  2. కడు నెఱుంగకయుండగా గట్ట ముంచి (క,చ)