పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

సౌగంధిక ప్రసవాపహరణము



హనుమంతుడు విశ్వరూపమును జూపుట

ఆనాఁటి మీరూప మారసి కాని
పో నన నంజనీపుత్రుఁ డవ్వేళ
నపరిమితం బైన యాకార రేఖ
నిపుణత మెరయనానృపతికిఁ జూపె
గగనంబుఁ గబళించు కనకాద్రివోలె 85
తగిన గాత్రము దిగంతము లెల్లఁ గప్పి
యలమిన వాలయుతాకార మరసి
కలఁగి విస్మయమంది కనుదోయి మొగిని[1]
చింతించి యాభీమసేనుఁ డెంతయును
మంతు కెక్కిన హనుమంతుని కనియె 90

అతిభీషణం బది యత్యద్భుతంబు
వితతంబు నగుచు పృథ్వీగగనంబు
లలమియున్నది నీమహాకార రేఖ
సొలయక కనువిచ్చి చూడఁగా నోప
జాలింపుఁ డనిననాసహజన్ముపల్కు 95

  1. కలవియస్మయమంది కనుదోయి మూసి (1378)