పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

191



వర్ణాశ్రమంబుల వర్తన ల్గలిగి
స్థిదవేదశాస్త్రచోదితములు నగుచు65
ధరసర్వకర్మముల్ ధర్మముల్ బరగు,
వెలయు గామాదు లా వేశించి యుండు;
కల సత్యనీతిమార్గంబులు దఱుఁగు
ప్రోదిగా కలియుగంబున, ధర్మ మేక
పాదంబున మెలంగు పటుగృష్ణవర్ణుఁ70
డగుచు విష్ణుఁడు బ్రోచు నవనీతలంబు
నొగి జను ల్బహుతమోయుక్తులై యెపుడు
కామాదిదోషసంగతులై యధర్మ
భీమకర్మముల ఱంపిల్లు చుండుదురు[1]
పొలుపొందునట్టి తపోదానమహిమ75
లిల బహుఫలములై యెసగుచు నుండు
ననీ యుగ భేదంబు లన్నియుఁ దెల్పి
యనువొంద దీవించి యరుగు మిం కనిన
యనుమోదమున మ్రొక్కి యభినుతుల్చేసి
వనచరేంద్రుసకు భూవరుఁ డిట్లు బలికె 80

  1. భీమకరముల మొరపెట్టుచుండుదురు (చ)