పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సౌగంధిక ప్రసవాపహరణము




ననబోణి యడుగుట నారదమౌని
వేవేగ వచ్చుట వికచాబ్జముఖికి
కావలి యాఘటోత్కచుని దెల్పుటయు
ననిలతనూభవుం డలరుచుఁ గూర్మి
తనయుఁ దలంచుట తడయక నతఁడు[1]
వచ్చుట పాంచాలివద్ద నాఘనుని
మచ్చికతో నుంచి మసలక వేగ
నెంతయు నేఁగుట, నింతి దాఁ గొంత
జింతనేయుట పట్టి చింతబాపుటయు
నలమార్గముననుండి యాంజనేయుండు
బలుమాయ గల్పించి భ్రమల దూలించి
వలసి యన్యోన్యవివాదము ల్చేసి
చెలువంబుతో భీమసేనునిమ్రోల
నలపడ ప్రత్యక్ష మైనట్టి కథల
నలరుచు నిది ప్రధమాశ్వాసె మయ్యె

ప్రథమాశ్వాసము సంపూర్ణము.

  1. తనయుండు వచ్చుట దగుసంభ్రమమున (ట)