పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

185



మానిత భాషణం బామనఃపద్మ[1] '
భానునిపేర వైభవజిష్ణు పేర
రావిళ్లకొండధరామరులింగ
భూవల్లభునిపేర బుధు లౌ ననంగ2080
నంకితంబుగ నుపమాది ప్రోల్లసద
లంకార బహువిధ లక్షణఫణితి
తనరు వేడుకలరత్నాకరకృష్ణ
ఘనునిగోపాలసత్కవిశేఖరుండు
సరసోక్తిరచియించె సౌగంధికాప2085
హరణకావ్యంబునం దాపాండుసుతులు
వలనొప్ప బదరికావనముఁ జేరుటయు
నలరు ద్రౌపది దోడ్క వనిలనందనుఁడు
వనభూమి కరుగుట వనజంబు గనుట[2]



ప్రతిభగల్గినయట్టి ప్రావీణ్య పేర
కఠినచౌరాసీదుర్గవిభాగు పేర
చటులవిక్రమ పుణ్యశాలియు పేర (ట)

  1. మానిత భాస్కరాంబామనఃపద్మ
  2. వనభూమియందుల వసియించి చనుట