పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

184

సౌగంధిక ప్రసవాపహరణము



తరకీర్తిపేర మేధానిధి పేర
సరసకళాపూర్ణ చంద్రునిపేర
సుకవిపోషణుపేర శుభమూర్తి పేర
సకలపురాణార్థసంగ్రహు పేర
నాదనినదుర్గహరణుని పేర
చేదిభూవరదత్తసింహతలాట
కరహటనృపదత్తకనకపతాక
బిరుదాంకుపేర గంభీరాబ్ధి పేర
కరనొప్ప జగనొప్ప గండని పేర
శఠనృపాలకశైలశతకోటి పేర
కఠినచౌరాసి దుర్గవిభాళు పేర[1]

  1. విలసిల్లు శ్రీరాయ వేశ్యాభుజంగ
    కులసంభవుండు సద్గుణపుణ్యశాలి
    వలనొప్ప కేళాది వైభవసాంద్ర
    సలలితౌదార్యుండు సంగ్రామభీముఁ
    డగు నజ్జనాధారుఁ డార్యపోషకుఁడు
    ఆగణిత ధౌరేయుఁ డర్థిమందారు
    శత నృపాలకశైల శతకోటిపేర