పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

178

సౌగంధిక ప్రసవాపహరణము



తనమదిలోఁ గొంతతడవు చింతించి
ఘన మిది సాధ్యంబుగా దని యెంచి
యనఘాత్ము డేయుపాయము లేక బెగడి
పలుమరు దశదిశల్' పరికించుచున్న
నలువెల్ల దెలిసి వానరనాథుఁ డనియె
జగదీశ! యిఁకనైన చాలింపరాదె!
దగ దొట్టి దగిలించి తడబడనేల[1]
వరబాహుబలిమి నావాలదండంబు
దరలింప లేవు పద్మములు దేఁగలవె![2]
నిను నీవు తెలియవు నీచేతఁ గాని
పనులకు వత్తువే పనులకు నిటకు[3]
పొలుపొంద పవమానపుత్రుండ వానచుఁ
దలఁతురు నిన్ను భూతలమున నెల్ల
కలమాట నిజమైనఁ గరువలిపట్టి

  1. (a) దగదొట్టి దగలించి తడబడనేల (ట)
      (b) తగదిటు గదలింపఁ దడఁబడ నేల. (ప్రాతఅచ్చు ప్రతి)
  2. ఒరలింపగలవె యోభూనాధచంద్ర (ట)
  3. పనుపున వత్తురే పనులకు నిటకు (ట )