పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

సౌగంధిక ప్రసవాపహరణము



వాలంబుతోఁబట్టి వరణముల్ద్రిప్పి[1]
నేలలోఁ గొట్టనా నీ న్నీక్షణంబు
నిముషంబులోపల నీతనువెల్లఁ
దుమురుగాఁ జేతును దుర్మార్గ! యనిస
తరుచరాధ్యక్షుండు ధరణీశుమోము
పరికించి యిట్లను బకపక నగుచు
పాండునందన నీప్రభావంబు బలిమి
పండుపల్లనె గానబడినది గాదె!
నిన్ను జూచితిగాని నీసాహసంబు
లెన్ను చుండెడివారి నెవ్వరి నెఱుఁగ
చలమున నిశ్శంక సాహసు లిట్లు
పలుకరు నినువంటి పందలుగాని
తెల్లమిగలనరుల్ తిన్నగా బారు
పిల్లవంకలు మొరల్బెట్టుచు దుముకు
నను దాటఁజాలవు నను మీటలేవు.
ఘనశక్తి వాలంబు గదలింపఁగలవె
యీ నీచవాక్యంబు లేల నారోమ

  1. వాలంబుతోఁబట్టి వడిగ నినుఁ ద్రిప్పి