పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

సౌగంధిక ప్రసవాపహరణము



బాహుబలంబు నీబగినెల్ల దెలిసె
కూతలు బెట్టుగా గూసినవాని
చేతగా దనుమాట సిగ్ధంబుగాదె 1900
జగతిలో నింతగా జలజసంభవుఁడు
మగపుట్టుఁ బుట్టించె మాయన్న! నిన్ను
పాలుమాలిన యట్టిపాపపుబుట్టు
వేల బుట్టఁగవలె నీలోకమునను
జననాథ సకలదేశములఁ గాంచితిని 1905
నినువంటిపందల నే నెందుఁ జూడ
నీలావు నీజిగి నీయొడ్డుపొడుగు
భావింపఁ గన్నులపండు, వయ్యెడిని!
ఓరి! నీ కేమాయె! నొరపైనపెద్ద
బూరుగవృక్షంబుఁ బోలి యన్నావు! 1910
నిన్నుఁజూచిన నిల్యు నీరు పండెడిని
అన్న నీసాహసం బంతయుఁ దెలిసె [1]

  1. పలుమరు నీ భుజాబలిమి గనుగొన్న,
    నలువొంద నాకును నవ్వుపుట్టెడిని. (త)