పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

171



వరబాహుశక్తిచే వడిగ వైచుటయు;
ఆది మహారయమున నటు బరతెంచి
పరువడి ఫలము నిబ్బరముగ దావి
చెదరక బంగారు చెండుకైవడిని 1885
గదతోడ నెగసి యాకాశమార్గమున
నటియింపుమను యోజనం బరుదెంచి
యటుబోకనిటురాక నంతట నిలిచి
భానువైఖరినిస్వర్భానునిలీల
భూనుత ప్రభలచేఁ బొలుపొందుచున్న 1890
ఫలవిలాసమును నాప్రతిభ వీక్షించి
పలుమరు‌ చింతించి ప్రౌఢి చాలించి
మదిలోన డోలాయమానసుఁడై యంత
యిది యేమి మాయయొ! యీభూమితీరొ [1]
తెలియరా దని తనదెసఁ జూచుచున్న 1895
బలశాలిఁ గనుగొని పలికె వానరుఁడు
ఓహోహొ! యీగద నుంచి నీచండ

  1. యిది భూవిశేషంబొ! యీశోతిమహిమొ (త)