పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

సౌగంధిక ప్రసవాపహరణము



పండన నెంత! నీపని యన నెంత!
ఖండింతు దండింతు గదగొని యిపుడె
అడరంగ నాయుపాయంబు లన్నియును
నుడిగియు నోరేల యడుగకపోయె?
చెలరేఁగి యీకోతి చేష్టలుసేయ 1805
నలుక పుట్టదె యెంత యోర్పరికైన
నవలక్షణపుకోతియై బంగి మ్రింగి
శివ మెత్తి వెంట వృశ్చికము సంధించి
పెనుబాము బంధించి పిడికిళ్లఁ జిక్కి
యనలంబు ద్రొక్కి‌ దయ్యము లూదినపుడు 1810
ఏగుణంబులచేత నెసఁగుచు నుండు
నాగుణంబులు గాననయ్యె నీయందు
వానరాధీశ! నీవంశ మిట్టిదయ;
యేనాట యెదురు ద న్నె ఱుఁగక నీవు
కొసవెఱ్ఱి బలుగొంటెగూబ జం కెనలు [1] 1815
వసుధపై మీస్వభావంబు లెగావె!
కలనైన మిమ్ములఁ గనుఁగొన్న హాని

  1. కొసవెఱ్ఱి పలుగొంటె ఝం కెనలు. (త)