పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

165



మేన కండలు బెంచి మించి మదించి 1785
పూనిక గడిపోతు పోల్కి నుండఁగను
నిన్ను నే నెరనమ్మి నెమ్మితో వేఁడు
కొన్నది నావల్ల కొదువ రెంతైన[1]
ఎనుపోతు గాంచి మత్తేభం బటంచు
ననువొందఁగా భృంగమాశించినట్లు 1790
వాసికెక్కిన మగవాఁడనే యనుచు
ఆసింప నాశ నిరాశఁ జేసితివి
పంద నీ దేయూరు! పద్మ మేయూరు!
ఇందేల వచ్చితి వేఁగు వేవేగ!
అన విని కోపించి యాపాండుసుతుఁడు 1795
వనచరాథీశ్వరువదనంబుఁ గాంచి
నినుఁ జూడు, నను జూడు నీ వెంతవాఁడ
వనరానిమాట లి ట్లాడ నేమిటికి?
నాపేరు చెప్పిన నను గనుంగొనిన
నేపారలోకంబు నిట్టటుగానె 1800

  1. కొన్నది నావల్ల కొదువ లెంతయును. (త)