పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈయుద్ధములో లింగభూపాలుఁడు దళవాయి వేంకటధరణీశుచే మెచ్చులందె నని కవి వ్రాసినాఁడు. ఈవేంకటధరణీశుఁడు వెలుగోటి వెంకటపతినాయనింగారు గానోపు. నెల్లూరు ఉదయగిరి సీమల నీతడు రెండవ వెంకటపతిరాయలచే నమరముగ బడసెను.[1]

  1. Nellore District Gazette Vol. I. Page 63. లేదా వెంకటధరణీశుఁడే పెదవెంటపతిరాయలు గావచ్చును. ఈ పెదవెంకటపతిరాయలు, రెండవరాయలకు (1614-1690) సామంతుడుగ తిరుచునాపల్లిఖండము నేలుచుండెను. మొదటి వెంకటరాయల మరణానంతరము సంభవించిన కుటుంబకలహ, రాజకీయవిప్లవములందు, రామరాయలకు వెంకటపతిరాయలు సహాయుఁడై, యాతనిరాజ్యమును స్థిరముగఁ బ్రతిష్టించియుండవచ్చును. ఆకాలముననే సుల్తానితో యుద్ధముపొసఁగియుండును. కాని యీయుద్ధము మూఁడవ శ్రీరంగరాయలకాలమున సంభవించియుండుననియు, సుల్తాని, రాయల పెనుగొండను స్వాధీకపఱచుకొనుటయందు సహాయుఁడై వచ్చియుండునని శ్రీ వెంకటరమణయ్యగారు తలంచుచున్నారు. (Sources of Vijayanagar. Vol I. P. 369)