పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

153



వలయు నటంచు జవంబున లేచి
మనుజేశుఁ డేతెంచుమార్గంబునందు
నొనర కన్నులు మూసి యొగి నోరు దెరచి 1620
పలుమఱు నఱచుచు బయలు బ్రాకుచును
తలవడ కింపుచు దగ్గుచు నిలిచి[1]
పలువిడి రోజుచుఁ బడియుండె నచట

  1. అతిరయంబున జను నాభీమసేను
    గతియెల్ల మున్నె తా గన్నట్టెతెలిసి
    యంతరంగంబున నాంజనేయుండు
    గొంక చింతించి వేగురుముదికోతి
    తనువు గైకొనివచ్చి తగమ్రానికింద
    నొనర కన్నులుమూసి నొగి నోరు దెరచి
    తెరుపుకడ్డముబడి తెలివి లేనటుల
    కరచరణాదులు కదలింపలేక
    నుసు రుసు రనెడి నిట్టూర్పులతోడ
    బుస పెట్టుచును బోరుగొండచందమున
    మూల్గుచు బలుముచు ముడుగుచుఁ బొరలి
    నీల్గుచు వడకుచు నెరయ నున్నంత. (త)