పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

సౌగంధిక ప్రసవాపహరణము


వరవేగసంఘాతవాతజాలములు
సొరిగి జంతువులెల్ల సుడిగొని తిరుగ
యలవైనతేయుని యనువు జెన్నొంది 1605
ఎలమి మహోద్ధతి నేఁగుచు నుండి
గరుడకిన్నరయక్ష గణము భేదిల్ల
గిరులెల్ల నురుల మిక్కిలి దిక్కులవియ
ధారుణి గంపింపఁ దరువులు పెకల
భోరున శంఖంబుఁ బూరించుటయును 1610
పిడుగుమ్రోఁతలఁబోలు బెడిదంపురవము

ఆంజనేయుఁడాశంఖారావమునువిని లేచుట

కడువడి విని లేచి కపినాయకుండు
వడముడి శంఖారవం బిది యనుచు
తడయక యంత నుదగ్రతఁ జూచి[1]
యతఁడు వచ్చినకార్య మంతయు నెఱిఁగి 1615
అతనిభుజాబలం బతని శౌర్యంబు
దెలిసి పద్మము లున్న తెఱఁగెల్లఁ జెప్ప
 

  1. తడయక నెంతయుఁదా విచారించి(ప)