పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

సౌగంధిక ప్రసవాపహరణము


 
మొనలు జిక్కుకయున్న మొల్లబాణంబు
లనఁ బొల్చె తారక లాకాశవీథి
రమణీయగిరిగహ్వరంబులు వెడలి
గమకమై చనుభల్లుకంబు లనంగ
గరుడవాహనుమీఁదఁ గడుదండు వెడలి1505
పరతెంచురాక్షసబలము లనంగ[1]
ననిలుని దార్కొన నధికవేగమున
కనలుచు చను ఘనాఘనము లనంగ
తనర నెల్లడల తానయై నిండి?
కనుపించు హరిదేవకాంతు లనంగ1510
భూనభోభాగముల్ పూర్ణమై కవిసి[2]
కానఁగానఁగ మీంచె కటికఁచీకటుల

చంద్రోదయవర్ణనము

ఆసమయంబున యామినీరమణి
భాసిల్లు హరిపదపద్మావధూటి

  1. అలఘుపంకజభవాండకరండభూరి
    కలికబంధురదివ్యకస్తూరి యనఁగ (ఠ)
  2. భూనభోభాగసంపూర్ణమై కదిసి (క)