పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

సౌగంధిక ప్రసవాపహరణము

పలుమఱు నిటువంటిపనులకై నీవు
వలవదు విలసింప వనజాతపాణి
యని కోటిచండమార్తాండసంకాశ
ఘనతరమాణిక్యఖచితసంకలిత
తనదివ్యమకుటంబు ధవళాక్షిపాద
వనజాతములు సోక వరభయభక్తిఁ
బ్రణమిల్లి లేచినఁ బటుబలాధిపుని
రణరంగవిజయుని రాక్షసాధిపుని
కనుగొని పాంచాలి కచవివిజితాశి
యనువొంద దీవించి యతని కి ట్లనియె
దనుజేంద్ర నినువంటితనయుఁ డుండగను
మనసులో నా కనుమాన మేటికిని
యదుకులస్వామి కటాక్షంబు గలుగ
పదపడి మరికొంతభయము నాకేల
పంకజంబులకు నే పతి నంపినట్టి
యపకీర్తి దరిగె నెంతయుగాని?
విపరీతములకు నే వెరువలేదన్న
యని పల్కి తనమదియడలు వారించి
కనకాంగినిశ్చలగతి యున్నయంత
తను బ్రయోగింప నుద్దండత వెడలి