పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

141

నని యొక్క రథముపై యబ్జాక్షి నునిచి
కనకపంకేజంబు గైకొని వేగ 1470
నలనొప్పు బదరికావనమార్గమునను
బలములతోడ నిబ్బరమునఁ జనియె

సూర్యాస్తమయవర్ణనము.


తను ప్రయోగింప నుద్దండత వెడలి
దనుజవీరులనెల్లఁ దగఁ దునుమాడి
ఘనర క్తయుక్తమై గ్రక్కున మరలి[1] 1475
చనువున పశ్చిమజలరాశి యనెడి
చెలువంపు టోరలోనఁ జేరు కంజాక్షు
సలలితం బగుదివ్యచక్ర మనంగ
నరయ మహానటుం డసువీరముష్టి
దురుసునఁ బరువళ్లు దొక్కునవ్వేళ 1480
నలరుచు సమయకంజాక్షి వాయించు[2]

  1. ఘనతరరత్నసంకలితమై మరలి (త)
  2. ప్రతిలేని నాభుజాబలశక్తి పాండు
    సుతులకు పజ్రాంగి జోడుమృగాక్షి