పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

సౌగంధిక ప్రసవాపహరణము

జనపతి యుంచు నచ్చట నుండ కేసు
యతని యానతి మీరి యరిగితినేని
యతివరో! స్వామి భృత్యన్యాయ మగునె?[1]
మాయయ్య యసహాయమహిత శౌర్యుండు, 1415
మాయయ్య యత్యంతమానధనుండు
దేవప్రసూనము ల్దెచ్చి యిమ్మనుచు
నావీరు నొక్కని యడిగితి నీవు
యతఁడు దాఁ దెచ్చెద నని మమ్ము నెల్ల
చతురో క్తి మెరసి యిచ్చట నిల్పి చనియె 1420

నాతని కేసహాయంబుఁ బంచినను
నాతండ్రికిని ప్రతిజ్ఞాభంగ మౌను[2]

  1. యితరమౌ స్వామి భృత్యన్యాయ మగునె (ట),
  2. అమరేంద్రు గొట్టెద నగ్ని బట్టెదను
    శమను ముట్టెదను పుణ్యజనుని మొట్టెదను
    వరుణుని తెంచెద వాయు నొంచెదను
    నరవాహనుని మహానటు పశించెదను
    వాలాయమున సప్తపరనిధానములు
    గాలింతు సకలలోకములఁ జరింతు
    కడిగొందు కలమహాగ్రాహసంఘములు
    మడియింతు గ్రహతారమండలి నెల్ల
    భూవరుదేవి సమ్మదమున నీవె
    భావించి చూడుము పాంచాలితనయ
    నన్ను నాఖ్యాతి నెంతయు నెఱుంగకను
    కన్నతల్లివిగాన కారులాడితిని
    జనని యిందుల కేమి సంతోషమాయె
    నిను మింక నొకరీతి విన్న వించెదను
    ననుఁ జేరఁ బిలచి యెంతయు గారవించి
    కనికరంబున గ్రుచ్చి కౌఁగిటఁజేర్చి
    తనయ భద్రం బని తడయక నేఁగె
    యదిగాక నికనొక్క యనుమాన మొదవె
    నదియు దెల్పెద విను సంభోజవదన (త)