పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

సౌగంధిక ప్రసవాపహరణము

గద్దించితే నేమి కార్యసాధనము! [1]
అక్కడ వడముడి యహితులచేత
చిక్కి నొచ్చిన నేమి సేయఁగవచ్చు 1380
నటుమీఁద నీదుసాహసము నీబాణ
పటలంబు నీభుజాబలము మాకేల!
సొలసినపిమ్మట బోయి మీయయ్య
కొలదీర్చిరా మది గోరితివేమొ
అని పల్కి విని విన్నయై తలవాంచి 1385
కనకాంగితో ఘటోత్కచుఁ డిట్లు పలికె
నాతల్లి యింత చింత గలంగ నేల?
వాతాత్ముజుం డాహవమునఁ జిక్కినను
పగలు చుక్కలురాలు వద్మబాంధవుఁడు
తొగలరాయఁడు తప్పుత్రోవ నేఁగుదురు. 1390
సొగలు లోకాలోకములు బెగ్గడిల్లు
గగనోర్వులల్లాడు కమలజాండములు
పటపటపగులు సప్తపయోధు లింకు

  1. గద్దించినను నేమి కార్యసాధకము (త)