పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

సౌగంధిక ప్రసవాపహరణము

రాముని మాయాకురంగంబు జొనిపి
కామిని నెడబాపుకరణి నే నిపుడు
భూమీశు నెడబాపె భూరిపంకజము 1345
ఏమికార్యం బౌనో యెఱుఁగరా దింక
తనరార ధర్మనందనుఁ డిది విన్న
ననుదూరు, నిందించు, నామీఁద నలుగు
నని విలపించు నయ్యంభోజముఖిని
గనుఁగొని యఘటోత్కచుఁ డిట్లు పలికె. 1350
అమ్మ ! నీ వీపని కడల నేమిటికి?
నెమ్మది నిదె వచ్చు నీ ప్రాణవిభుడు
ఆవీరశేఖరు నామహాబలుని
దేవదానవకోట్లు దృష్టింపఁగలరె !
అటు గాక వేరొకటైన నాబాణ 1355
పటలంబుచేత నీపదములకడకు
పరలోక సురలోక నాకలోకములఁ
దిరముగ నిప్పుడె దెప్పింతుఁ జూడు
గొనకొని యిటువంటికొడుకు గల్గఁగను
వినవిమ్మ నీ కేల విడువు భయంబు.