పుట:సౌగంధిక ప్రసవాపహరణము.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

131

విననైతి నే నింత వీఱిఁడి నైతి
వనవిహారం బేల వచ్చితి! వచ్చి
కనకకంజము కాంచితి! గాంచి 1330
పదరి నే నెందుకు పట్టినపట్టు
వదలక ననిచిత వాయునందనుని
మించిన నామాట మీరంగలేక
వేంచేసె నొంటిగా విపినభూములకు: [1]
కరమర్థి సౌగంధికము లున్న నెలవు. 1335
లెఱఁగునో యెఱుఁగడో యేకార్య మగునొ
ఆసకు సిగ్గులేదాయె! యయ్యయ్యొ
నా సరివారిలో నగుబాటు గలిగె
వెలయ పెద్దలబుద్ధి వినకనే వచ్చు
ఫలమెల్ల చేఁజేత ఫలియించె నిపుడు. 1340
పతి నంపి యెంత పాపంబు గట్టుకొంటి!
మితిలేని యపకీర్తి మెడఁగట్టుకొంటి!

  1. హెచ్చుగు నాకోర్కె మీరంగ లేక
    విచ్చేసె నొంటిగా విపినభూములకు (త)